ప్రజాశక్తి-సత్తెనపల్లి : భారతదేశ స్వాతంత్య్రం, సమైక్యత, సమగ్రత, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, వాటిని కాపాడుకునేందుకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో యువత పునరుంకితం కావాలని సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజల మధ్య మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజలను అభద్రత భావానికి గురిచేస్తోందని, నేడు యువత స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో దేశ సమాఖ్యత, సమగ్రత, స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు పునరంకితం కావాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.బాలకృష్ణ, జె.రాజకుమార్, ఎ.ప్రసాద్‌రావు, పి.సూర్యప్రకాశరావు, జి.సుసులోవ్, పి.రామారావు, ఎం.జగన్నాధరావు, పి.ప్రభాకర్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ప్రాంగణంలో జాతీయ జెండాను కేంద్రం కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి ఎగురవేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) కార్యాలయం వద్ద జెండాను యూనియన్ అధ్యక్షుడు కన్నెగంటి రామారావు ఎగురవేశారు. సిఐటియు జిల్లా కోశాధికారి డి.శివకుమారి మాట్లాడారు. వివిధ సంఘాల నాయకులు సిలార్ మసూద్, రామారావు, కోటేశ్వరావు, సుభాష్ చంద్రబోస్, కె.రామారావు, మస్తాన్‌రావు, ఎన్.కోటేశ్వరావు, ఎ.లలిత ప్రసాద్, కృష్ణ, బోసు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : కళలను, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని, వాటి ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయొచ్చని రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆటాపాటా నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా గోపాలరావు మాట్లాడుతూ కుల, మతాల మధ్య ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు, ప్రజల్లో అవగాహన పెంచడానికి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతురెడ్డి, నాయకులు రంజాన్‌బి, తిరుమల లక్ష్మి, ఎస్‌కె నాసర్ బి, ఆర్.మునివెంకటేశ్వర్లు, సురేష్‌రాజా, మహేష్, కళాకారులు మూర్తిరాజు, రాజేష్, రోశయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని మాచర్ల బస్టాండ్ సెంటర్లో సిఐటియు, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల దీక్ష శిబిరం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి జె.కృష్ణానాయక్ అధ్యక్షత వహఙంచగా సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం దేశభక్తి గీతాలు, విప్లవక గీతాలు పౌరాణిక గీతాలను సుజాత, జి.నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, ఆర్.నాగేశ్వరరావు, శ్రీరాములయ్య, డి.వెంకటేశ్వర్లు ఆలపించారు. బి.నాగేశ్వరరావు, జి.కోటేశ్వరరావు, ఎ.కోటిరెడ్డి, ఎం.నరసింహారావు, ఎస్.వెంకటకృష్ణ, షేక్ బాబు, కె.సీతారామయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.










