జమ్మలమడుగు : దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ తులసి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గహంలో జమ్మలమడుగు అసెంబ్లీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం రాహు కేతువు లాగా దాపురించాయని వాపోయారు. 1947 నుంచి 2014 వరకు 67 ఏళ్లు నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ. 46 లక్షల కోట్లు అప్పు చేయగా, 2014 నుంచి 2023 వరకు కేవలం 9 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం రూ. 109 లక్షల కోట్ల అదనంగా అప్పు చేసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, విమా నాశ్రయాలు రైల్వేస్టేషన్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్‌ఐసి లాంటి సంస్థలను అమ్మకానికి పెట్టిందని అన్నారు. వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఎరువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. మోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మానవ ఇతిహాసంలో కనివిని ఎరగని విధంగా మారణ హోమం చేపట్టారని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని వాపోయారు. కడప జిల్లాలో సేల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్‌కు స్వస్తి పలికిందని, పోలవరం ప్రశ్నార్థకంగా మారి ందని విమర్శించారు.అనంతరం జమ్మలమడుగు కన్వీనర్ బండి జకరయ్య మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేస్తున్నామన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులుగా సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యం శర్మ, సుబ్బారావు, ఓబయ్య, జయరాం రెడ్డి, కష్ణారెడ్డి, యేసయ్య, పుష్ప రాజు, సులోచనమ్మను నియమించామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జానకిరామ్, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, సుబ్బరాయుడు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి










