![](/sites/default/files/2023-11/IMG-20231114-WA0279_0.jpg)
సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
భీమవరం :సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు, కేంద్ర కమిటీ పూర్వ నాయకులు వాసుదేవ్ ఆచార్య దేశానికి విశేష సేవలందించారని, ఆయన సేవలు ఎనలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానిక మెంటేవారితోట సిపిఎం కార్యాలయంలో వాసుదేవ్ ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ సిపిఐ (ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఆయన దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. బెంగాల్‌లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. పార్టీపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడంలో ఆయన ముందువరుసలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్, బి.వాసుదేవరావు, పట్టణ నాయకులు బొక్కా సత్యనారాయణ పాల్గొన్నారు.