Apr 05,2023 21:07

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌

దేశానికి మోడీ తీరని ద్రోహం
- ప్రజా వ్యతిరేక విధానాలపై 14 నుండి 20 వరకు విస్తృత ప్రచారం
- సిపిఎం, సిపిఐ నేతలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      దేశానికి, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందనిసిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి. రమేష్‌ కుమార్‌, ఎన్‌. రంగ నాయుడులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు వామపక్షాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రచార కార్యక్రమం నిర్వహణ సన్నాహక సమావేశం బుధవారం ఎన్‌జిఒస్‌ కాలనీలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకోవడం తప్ప ఎటువంటి మేలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎండగట్టడానికి ఈ ప్రచార క్యాంపెయిన్‌ చేపడుతున్నామని తెలిపారు. బిజెపి కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను ప్రజలకు తెలియజేయాలని, ఆర్థిక విధానాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జీఎస్టీ బారాలు ఇవన్నీ ప్రజల మీద విలయతాండవం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల సామాన్య మానవుడు బతికే పరిస్థితుల్లో లేడన్నారు. దేశంలో రాఫెల్‌, ఆదాని కుంభకోణం, రాజ్యాంగంపై దాడి జరుగుతుందని అన్నారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న విద్రోహాన్ని ఎలుగెత్తి చాటా లన్నారు. ప్రత్యేక హౌదా, విజన హామీలు అమలు ఇంతవరకు అమలు చేయకపోవడం దారుణ మన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకపోవడం వీటంన్నిటిపైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండ గట్టాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు విధించి వివిధ అదనపు భారాలు మోపిందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మతో న్మాదం పెరిగిపోతుందని, మైనార్టీలపై, దళితులపై దాడులు జరుగుతున్నా వైసిపి నోరు ఎత్తడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగు తుందని అన్నారు. భారతదేశం మోడీ-అమిత్‌-ఆదాని కంపెనీలాగా మారుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకుపోయి దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రచార క్యాంపియన్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ బాబా ఫక్రుద్దీన్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.