Oct 30,2022 22:27

ప్రజాశక్తి-చందర్లపాడు 

చందర్లపాడు మండ లంలోని రామన్నపేట గ్రామంలో అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌రావు, శాసనమండలి సభ్యులు డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్‌ కలాం దేశానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. నిరుపేద కుటుంబం నుంచి తన ప్రతిభతో దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్‌ కలాం జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.