
ప్రజాశక్తి-ఉయ్యూరు : దేశ అభివద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎనలేనిదని లయన్‌్‌స క్లబ్ క్యాబినేట్ ట్రెజరర్ నూకల సాంబశివరావు కొనియాడారు. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం లయన్స్ క్లబ్, ఎంకె అసోసియేట్స్ సంయుక్త ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మనిషి మేధస్సుకు శాస్త్రీయతతో డైతే భూమిపై మహాద్భుతాలు సృష్టించవచ్చని మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిరూపించారని గుర్తుచేశారు. క్లబ్ అధ్యక్షుడు ఎండి ఇస్మాయల్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ సత్యనారాయణ, టెలికాం విశ్రాంత ఏఈ కష్ణప్రసాద్, కేసీపీ ఇంజనీర్లు ఉమామహేశ్వరరావు, శాస్త్రి, ప్రభుప్రసాద్, అనిల్కుమార్లను ఘనంగా సత్కరించారు. క్లబ్ కార్యదర్శి నల్లా శ్రీనివాస్, ట్రెజరర్ వూరకిషోర్, దినవహిప్రసాద్ త దితరులు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.