జిల్లా న్యాయమూర్తి జి. శ్రీదేవి
ప్రజాశక్తి -అరకులోయ రూరల్ : దేశం ప్రగతిపథంలో పయనించాలంటే నేటి యువతలో మంచి మార్పు రావాలని జిల్లా న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆకాంక్షించారు. ఆదివారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులను చైతన్యపరిచారు .ప్రధానంగా నేటి యువత మాదకద్రవ్యాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, యువత గంజాయి, నాటు సారా, డ్రగ్స్ బారిన పడకుండా చదువుపై దృష్టిపెట్టాలన్నారు. చెడు అలవాట్లతో తక్షణమే ఆరోగ్యంతోపాటు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సాంకేతికపరంగా అనేక సంచలనాలు సష్టిస్తున్న నేటి యువత దేశ భవిష్యత్‌కు దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్టాల్స్‌ను తిలకించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు పబ్లిక్ పాఠశాల వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్, సిఐ జెడి బాబు, తహశీల్దార్ వేణుగోపాల్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










