Aug 15,2023 20:25

పోర్టు సీఈవో జి జె రావు

ప్రజాశక్తి -ముత్తుకూరు :దేశాభివద్ధికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని అదాని కష్ణపట్నం పోర్టు సీఈవో జి జె రావు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆదానీ కష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో గోపాలపురం అదాని స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ పెరేడ్‌ గ్రౌండ్లో నిర్వహించిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర అనంతరం ఎన్నో విజయాలను సాధించిందని అలాగే ప్రతి ఒక్కరూ దేశ అభివద్ధి కోసం కషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదాని కష్ణపట్నం పోర్టు లో 70 శాతం స్థానిక ఉద్యోగులతో ముందుకు సాగుతుందని పోర్టు అభివద్ధికి మరింత కషి చేయాల్సిన అవసరముందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, వ్యవసాయ, ఐటీ ,శాస్త్ర సాంకేతిక, రంగాలతోపాటు పర్యావరణ పరిరక్షణలో మరింత ముందుకు సాగాలన్నారు. కోవిడ్‌ 19 నివారణకు వ్యాక్సిన్‌ తయారుచేసి ప్రపంచంలో అద్భుతమైన మైలురాయలను దేశం సాధించింది అన్నారు చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం దేశ ప్రతిష్టలను మరింత పెంచింది అన్నారు విదేశాంగ విధానంలోనూ భారతదేశ కషి ఎనలేని దన్నారు. పేదరికం నిరక్షరాస్యత ఆరోగ్య సంరక్షణ తోపాటు ప్రతి పౌరుడు అభివద్ధి ఫలాలను పొందే విధంగా ఉండాలన్నారు. జై జవాన్‌ జై కిసాన్‌ జై విజ్ఞాన్‌ అనే దఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు అనంతరం ఆదానిక్‌ కష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు అదాని విద్యా మందిర్‌ విద్యార్థులు నిర్వహించిన సాంస్కతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం పెరేడ్‌ గ్రౌండ్‌ లో సీఈఓ మొక్కను నాటారు. సి ఓ ఓ సంజరు కొత్త వెంకటేష్‌ భాస్కరన్‌, గణేష్‌ శర్మ ,గంటా వేణుగోపాల్‌, వివిధ విభాగాలు హెచ్‌ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు. అలాగే అదాని కష్ణపట్నం పోర్టు అడ్మిన్‌ భవనంలో అడ్మిన్‌ హెడ్‌ గణేష్‌ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదాని వరల్డ్‌ స్కూల్‌ లో ప్రిన్సిపల్‌ సిరియాల సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.