Oct 02,2023 00:28

సత్తెనపల్లి: దేశ సంపద మొత్తాన్ని అదానీ,అంబానీలకు దోచిపెట్టే పనిలో ప్రధానమంత్రి మోడీ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ విమర్శించారు. 'విద్యుత్‌ సంస్కరణలు-ప్రజలపై భారాలు' అనే అంశంపై ఆదివారం స్థానిక 20వ వార్డులోజరిగిన సద స్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల అధ్యక్షత వహిం చారు. మహేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశ సంపదను ఆదాని అంబానీలకి దోచిపెడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా విద్యుత్‌పై ఆరు రకాల పన్నులు వసూలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ముఖ్యమంత్రి జగన్‌ అంగీకారం చెప్పడం దుర్మార్గమైన ఆలోచన అని అన్నారు. . అంబానీల కోసం ఆస్ట్రేలియా నుండి బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేయడం ద్వారా ప్రజలపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని అన్నారు. రైల్వేలు, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఓడ రవులు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఆదానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. మన రాష్ట్రంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ విదేశీ కంపెనీలకు అమ్మడం సరైన నిర్ణయం కాదని అన్నారు. దుర్మార్గమైన విధా నాలను ప్రజలు వ్యతిరేకించాలని, లేకుంటే భవిష్యత్తులో ప్రజలపై భారాలు ఇంకా పెరిగిపోతాయని అన్నారు. సదస్సులో అనుముల వీరబ్రహ్మం, రాజ్‌ కుమార్‌,ఆర్‌ పురుషోత్తం, పంతంగి ప్రభాకర్‌ గడ్డం సుస్లోన్‌ పాల్గొన్నారు.