
మదనపల్లె అర్బన్ : భారతదేశ సమగ్రాభివద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మదనపల్లి నియోజకవర్గం నాయకులు, పట్టణ అధ్యక్షులు ఎస్.రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పట్టణం,ఎగువ కురవంక ,నిమ్రాV్‌ా మసీదు సమీపంలో కురవంక యూత్ సయ్యద్ బేగ్, షేక్ సోనుల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 52 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్.రెడ్డి సాహెబ్ హాజరయ్యారు. ముందుగా స్థానిక యువత బాణాసంచా పేల్చి, పూలమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీలో చేరిన యువతకు ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువత పిట్టు, ఫయాజ్, లాలున్, అనీష్, ఇసాక్ కురువంక యువత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎస్.రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో సర్వమత సంక్షేమానికి, అభివద్ధి బాటలు వేస్తుందన్నారు. యువత ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి తొందరలోనే పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని యువత మొత్తం బలపరిచి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ముందుండి నడిపించాలని కోరారు. దేశ అభివద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అమోఘమైందన్నారు.ప్రస్తుతం బిజెపి అవలంబిస్తున్న విధానాలతో దేశ ప్రజలు విసిగిపోయారని,కాంగ్రెస్ పాలన కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నారన్నారు.సర్వ మానవ సమానత్వమే తమ పార్టీ విధానమని లౌకికవాదానికి సరైన నిర్వచనం చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ఉద్ఘట్టించారు. త్వరలో నిర్వహిం చబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలే పునరావతమవుతాయని ఆయన ధీమా చేశారు.ఇ ందులో భాగంగా పార్టీలో చేరిన యువతకు బాస్కెట్ బాల్ కిట్ ను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, వై.సురేంద్ర రెడ్డి,డాక్టర్ ఎస్.కే.బాషా, మహమ్మద్ రఫీ, మహబూబ్ పీర్, మహమ్మద్‌అలీ, సయ్యద్ ఖాసిం, పాలేటి, బాబ్ జాన్, అల్లా బక్షు, కురవంక యువత పాల్గొన్నారు.