ప్రజాశక్తి-యంత్రాంగం
ములగాడ : జివిఎంసి 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో శనివారం చేపట్టిన పాదయాత్రను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంధ్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలపై దేశరక్షణ భేరి కార్యక్రమాన్ని సిపిఎం నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 27న సరస్వతీ పార్కు నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు వేలాది మందితో మహాప్రదర్శన, అనంతరం బహిరంగసభ ఉంటాయని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, 63వ వార్డు కార్యదర్శి కె.పెంటారావు, సిపిఎం నాయకులు పి.సురేష్, కె.రాము, జి.నరేష్, మురళీ, నవీన్, గోపాల్, పివి.భాస్కరరావు, రామకృష్ణ, వాసు, విష్ణు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : దేశ రక్షణ భేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ ఆంజినేయులునగర్‌లో సమావేశం నిర్వహించారు. దేశ రక్షణభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, ఈ నెల 27న జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహించే బహిరంగసభను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగన్, అప్పలనాయుడు, సన్నిబాబు, లక్ష్మీనాగమణి, సన్యాసమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : సుందరయ్యకాలనీలో దేశ రక్షణ భేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, దేశ రక్షణ భేరి సభలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు










