ప్రజాశక్తి- యంత్రాంగం
బిజెపి పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న దేశ రక్షణ భేరి ప్రచారోద్యమ పోస్టర్లను గురువారం జిల్లాలో పలుచోట్ల ఆవిష్కరించారు.
తగరపువలస : తగరపువలస జంక్షన్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ, ఈ నెల 27న సరస్వతీ పార్కు నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవ్వ నరసింగరావు, జోగ వెంకటరావు, కిలారి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : సిపిఎం ఆరిలోవ జోన్ కమిటీ ఆధ్వర్యాన దేశ రక్షణ భేరి పోస్టర్‌ను స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్యం ప్రజలపై భారాలు ఎడాపెడా వేస్తుందన్నారు. నిరుద్యోగాన్ని పెంచుతూ ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ, దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తోందన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కూడా అన్నింటి ధరలూ పెంచి ప్రజలకు భారాలు వేస్తోందన్నారు. ఈ నెల 27న బహిరంగసభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి. రాఘవులు ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ జోన్ కార్యదర్శి విఎన్.కుమార్, నాయకులు పి.శంకర్, నాగరాజు, వి.కృష్ణమూర్తి, ఎస్.రంగమ్మ, రమణ పాల్గొన్నారు.
ఉక్కునగరం : ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్ యూనియన్ అధ్యక్షులు జె.అయెధ్యరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోనిబిజెపి ప్రభుత్వం సామాన్యులపై పెను భారాలను వేసి కార్పొరేట్‌లకు దోచిపెడుతోందని విమర్శించారు. ఈ నెల 27వ తేదీ బహిరంగ సభకు అందరూ హాజరై జయప్రదంచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టివికెరాజు, ఒవి.రావు, శ్రీనివాసరాజు, బొండా తౌడన్న, కొవిరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.










