Sep 19,2022 00:14

కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-పెందుర్తి : దేశ రక్షణ భేరిని విజయవంతం చేయాలని కోరుతూ పెందుర్తి రైతు బజారు వద్ద సిపిఎం ఆధ్వర్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో పాదయాత్ర, 27న సరస్వతి పార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం ప్రజలపై ఎడాపెడా భారాలు వేస్తోందన్నారు. అదాని, అంబానీల సంపాదన కోసమే బిజెపి ఆలోచిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి ప్రయివేట్‌ వ్యక్తులకు కడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శంకరరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.