ప్రజాశక్తి-పెందుర్తి : సిపిఎం చేపట్టిన దేశ రక్షణ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణరాయపురం సమీపంలోని జ్యోతినగర్‌లో పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి.అనంతలక్ష్మి మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిసిందన్నారు. అంబానీ, అదానీలకు మరింత సంపదపెట్టేందుకే మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రతిఘటించడం కోసం దేశరక్షణ భేరిని విజయవంతంచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.సింహాచలం, డి.అప్పలరాజు, టి.నూకరాజు, ఎర్నిబాబు, చిన్నమ్మలు, బి.జయలక్ష్మి, గోపాల్, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు,
ఐద్వా ఆధ్వర్యాన...
ఐద్వా ఆధ్వర్యాన సాయి మాధవ్‌నగర్, శ్రామికనగర్, అప్పన్నపాలెంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి డి.లావణ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వ విధానాలపై చేపట్టే ఉద్యమాలకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి రమణి, విజయలక్ష్మి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










