Aug 14,2023 18:29

జెండాను తీసుకెళుతున్న దృశ్యం

జెండాను తీసుకెళుతున్న దృశ్యం
దేశ ఔన్నత్యాన్ని చాటడమే లక్ష్యం
ప్రజాశక్తి-నెల్లూరు :భారతీయులందరూ ఒక్కటేనని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా మన భూమి - మన దేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.ఆజాదీకా అమత మహోత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో భాగంగా 500 మీటర్ల భారీ జాతీయజెండాను ఆవిష్కరించి అనంతరం విఆర్‌సి సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మ వరకు ప్రదర్శన నిర్వహించారు.కష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు వందేమాతరం - మాదే ఈ తరం, ఎర్రకోటలో ఎగిరిన జెండా - ఎదురే లేదని చాటిన జెండా వంటి నినాదాలతో కదంతొక్కారు. ర్యాలీ ముందుభాగాన స్వాతంత్ర పోరాట యోధుల పాత్రలతో చిన్నపిల్లలు ఆకట్టుకున్నారు. తొలుత వి ఆర్‌ సి సెంటర్‌ లోని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన జెడ్‌పి ఛైర్‌ పర్సన్‌, చివర్లో గాంధీ బొమ్మ సెంటర్‌ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం ముగించారు.ఈ సందర్బంగా జెడ్‌పి ఛైర్మన్‌ మాట్లాడారు.కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ చిరంజీవి, డి పి ఓ సుస్మిత, డ్వామా పిడి వెంకట్రావు, బిసి సంక్షేమ అధికారి వెంకటయ్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.