Sep 01,2023 22:17

ఫొటో : జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఆర్‌టిసి డిఎం కరీమున్నీసా

దేశ ఆర్థికవ్యవస్థలో 'ఎస్‌ఐసి' కీలకం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : దేశ ఆర్థిక అభివృద్ధికి ఎల్‌ఐసి ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆర్‌టిసి డిఎం కరీమున్నీసా అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని భారతీయ జీవిత బీమా సంస్థ ఆత్మకూరు బ్రాంచ్‌లో 67వ బీమా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆర్‌టిసి డిపో మేనేజర్‌ కరీమున్నీసా ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిస్తుందని తెలిపారు.
అలాగే సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మెహ్ర కుమార్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసి 68 శాతం ప్రీమియం 78 పాలసీలు మార్కెట్‌లో ముందంజలో ఉందని ప్రజల డబ్బు ప్రజలకు ప్రజల కోసమే అన్నట్లు సంస్థ అభివృద్ధి గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆఫీసర్లు ఎబిఎం శివకుమార్‌, నాగరాజు దశయ్య, యూనిట్‌ కార్యదర్శి ఏవి రమణయ్య, ఆఫీసు సిబ్బంది టీ రమేష్‌, ప్రవీణ్‌, మన్సూర్‌, నరసింహారెడ్డి, డెవలప్మెంట్‌ ఆఫీసర్లు మునీశ్వరయ్య, ఏజెంట్‌ మిత్రులు పాలసీదారులు అందరూ పాల్గొన్నారు.