దాచేపల్లి: నిబంధనలకు విరుద్ధంగా చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన మైనింగ్‌్ పెడగార్లపాడు గ్రామ శివారులో జరుగుతుండటంతో స్థానిక బీసీ కాలనీలో ఇళ్ల గోడలు బీటలు వారి దెబ్బతినడం తెలిసిందే. ఈ విషయమై కాలనీ వాసులు సిపిఎం ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్ వద్దకు వెళ్లి ఇటీవల ఆందోళన నిర్వహించి ఈ విషయం తెలియజేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో శనివారం రాత్రి చెట్టి నాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కొన్ని ట్రాక్టర్లలో ఇంటికి పది సిమెంట్ బస్తాలు చొప్పున తీసుకు వచ్చి, వీటితో పాటు తలా అర ట్రక్కు ఇసుక ఇస్తామని, ఇవి తీసుకొని కాలనీ వాసులు పేపర్లపై సంతకాలు చేయా లని డిమాండ్ చేశారు. యాజమాన్యం చెప్పిన దానికి కాలనీ వాసులందరూ తిరస్కరించారు. 'మీ వల్ల పాడైన ఇంటికి బదులు ఇంటిని నిర్మించాలి' అని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దాచేపల్లిలోని సిపిఎం కార్యా లయంలో ఆదివారం జరిగిన సమావేశం జరిగింది. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ పద్ధతులలో, అరకొరా ఇచ్చి చేతులు దులుపు కోవా లని చూస్తే ఫ్యాక్టరీ ముట్టడిస్తామని హెచ్చరించారు. దెబ్బతిన్న ఇళ్లకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.గత ఎన్నికల్లో నాలుగు రూపాయలు ఖర్చు చేసి తానే సర్పం చ్‌ని అనుకునే వ్యక్తి తనకు సంబంధం లేని విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం కొమ్ము కాసి, ప్రజలను బెదిరించాలనుకుంటే తగిన బుద్ది చెబు తామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు గోపాలరావు, అంజనేయరాజు, కె.సాంబయ్య, జె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










