ప్రజాశక్తి- యంత్రాంగం:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలు, పెంచిన నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, నిరుద్యోగ సమస్యపై సిపిఎం గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సమరభేరి పోరు సోమవారం మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలతో ముగిసింది. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీ యువత విద్యార్థులు, కార్మిక వర్గాలు, పలు గిరిజన సంఘాలు, మహిళలు పాల్గొని తమ నిరసనలను వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా గత నెల 30 నుండి ఈ నెల 4వ తేదీ వరకు గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించి ప్రభుత్వ విధానాలపై ప్రచారం నిర్వహించారు.సోమవారం ముగింపు సందర్భంగా గిరిజన సంఘం కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం డిప్యూటి తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అటవీ చట్టం అమలు చేస్తే అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, గ్రామ సభ వంటి చట్టాలకు నష్టం జరుగుతుందని దీంతో గిరిజనులకు అడవిపై హక్కు లేకుండా పోతుందని తక్షణమే రద్దు చేయాలన్నారు. సిపిఎం నేతలు పొద్దు బాలదేవ్, రామారావు, జె.భగత్ రాం, బుజ్జి బాబు, కె జగన్నదం పాల్గొన్నారు.
పాడేరు:పార్టీ మండల కార్యదర్శి ఎల్. సుందర్‌రావు, నాయకులు పి.లక్కు, కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యాలయం నుండి పాడేరు మెయిన్ రోడ్డు గా పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి ఆ కార్యాలయాల వద్ద బైఠాయించి ధర్నా జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోడీ ఇచ్చిన హామీనీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలతో మూతపడిన ప్రభుత్వ, ప్రవేట్ చిన్న తరహా పరిశ్రమల నుండి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుందర్‌రావు పాల్గొన్నారు.
హుకుంపేట:మండల కేంద్రంలో పార్టీ కార్యక్రమం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు అనంతగిరి జడ్పీటీసీ, సీపీఎం జిల్లా నాయకులు గంగరాజు మాట్లాడుతూ,మండలంలో 60 శాతం గ్రామాలకు రోడ్లు సక్రమంగా లేవన్నారు. వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సొంటేన హైమావతి, మండల కార్యదర్శి, మాజీ సర్పంచ్ వలసనైని లక్ష్మణ్ రావు, నాయకులు తమార్బ అప్పలకొండల పడాల్, తాపుల కృష్ణా రావు, పాంగి సోమన్న, పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: జీఒ 3 రద్దుతో గిరిజనులు ఉద్యోగాలు కోల్పోయారని సిపిఎం అల్లూరి జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రంలో సిపిఎం నాయకులు మూడు రోడ్ల జంక్షన్ నుంచి తసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు, నాయకులు పి.సురేష్ కుమార్, పి.సత్యనారాయణ, .డుంబు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: సిపిఎం కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం వద్ద మండల కార్యదర్శి పాంగి భీమరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొర్ర త్రినాథ్ మాట్లాడారు. సిపిఎం మండల నాయకులు కె నర్సయ్య, భీమరాజు, కె.శంకర్, నారాయణ, వి లైకోన్, విక్రమ్, భీమన్న, నీలకంఠం పాల్గొన్నారు.
జిమాడుగుల:మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకురాలు వి.వి.జయ, నాయకులు సాగిన ధర్మన్న పడాల్, దీనబంధు, ధర్మారావు, కోటి బాబు, నిరుద్యోగుల సంఘం మండల నాయకులు పి.చిన్నారావు, శ్రీలత, రాంనాయుడు, కే,దేవినాయుడు, రాము పాల్గొన్నారు.
అనంతగిరి:స్దానిక గిరిజన సంఘం కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ వారపు సంత మీదుగా తహాశీల్దాల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు దాడల సుబ్బారావు మాట్లాడుతూ, వెంటనే గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాక్ లాక్ పోస్టులు పోస్టులను భర్తీ చేయాలన్నారు.టోకూరు సీపీఎం సర్పంచ్ కిల్లో. మోస్య, పార్టీ మాజీ సర్పంచ్ సీవేరి. కొండలరావు పాల్గొన్నారు
పెదబయలు: తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు, నాయకులు శర్బన్న, బొండా గంగాధరం, చెండా రామారావు, భాషా వాలంటీర్ల సంఘం నేతలు వీరయ్య, టీ బంగారయ్య, కామేష్ పాల్గొన్నారు.
కూనవరం :పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్ చేశారు. సిపిఎం సమరభేరిలో భాగంగా సీపీఎం కూనవరం మండల కమిటీ ఆధ్వర్యాన స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న ప్రతి నిర్వసితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అమ్మాజీ, సర్పంచ్ నాగమణి, సీనియర్ నాయకులు తలగాని నాగరాజు, పాయం సత్యనారాయణ, కుంజా రాధ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చింతూరు : మండల రెవెన్యూ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కారం సుబ్బారావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడారు. నాయకులు పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మల్లం సుబ్బమ్మ, రంగమ్మ, ఎంపీటీసీ రాజకుమార్ పాల్గొన్నారు.
విఆర్.పురం : తప్పుడు తడకల కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా 1986, 2022 వరదల ఆధారంగా ముంపునకు గురైన అన్ని గ్రామాల ప్రజలకు పోలవరం ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పునెం సత్యనారాయణ, సర్పంచులు పూనెం సరోజిని, వెట్టి లక్ష్మి, ఎంపీటీసీ పూనం ప్రదీప్ కుమార్, సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు, కుంజ నాగిరెడ్డి, నాలారపు ప్రకాష్, గూటాల శ్రీను, ఖాదర్‌పాల్గొన్నారు.
ఎటపాక : సిపిఎం ఆధ్వర్యంలో ఎటపాక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఆకిసెట్ రాము, ఐ.పద్మ, జయమ్మ ఇరపా సత్యం, తోట శ్రీను పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. తొలుత రాజవొమ్మంగి యూనియన్ బ్యాంకు నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు మాట్లాడారు. సిపిఎం నాయకులు కొండ్ల సూరిబాబు, మేలిన రమేష్, కుంజం జగన్నాథం, పాల్గొన్నారు.
సీలేరు : జికె.వీధి తహశీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొనంగి చిన్నయ్య పడాల్, మండల కార్యదర్శి ఎ.బుజ్జిబాబు, నాయకులు గడుతూరి సత్యనారాయణ, కొర్ర బాలయ్య, బాబురావు పాల్గొన్నారు.
కొయ్యూరు : అల్లూరి జిల్లా కొయ్యూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి ఎస్.సూరిబాబు, నాయకులు మెరిసి జయలక్ష్మి, జె.పెంటయ్య, కుమార్ పాల్గొన్నారు. నాయకులు వై.అప్పలనాయుడు, పి.బొంజన్న, రాజన్న పాల్గొన్నారు.










