Oct 01,2022 22:57

డౌనూరులో గ్రామసభలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి నూకరాజు

ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని డౌనూరు గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్‌ పొట్టిక భవాని అధ్యక్షతన శనివారం గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీలోని పలు సమస్యలపై ఈ సభలో చర్చించారు. జడ్పిటిసి వారా నూకరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సమస్యలపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బిడిజాన అప్పారావు, పంచాయతీ కార్యదర్శి రేష్మ, వైసిపి నాయకులు పొట్టిక పోతురాజు, సురేష్‌ పట్నాయక్‌, పండ్ర గంగరాజు, దొండ ప్రసాద్‌, వార్డు సభ్యులు, పంచాయతీ పరిధిలోని 13 గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.
సీలేరు గ్రామసభ వాయిదా
ప్రజాశక్తి- సీలేరు
జీకే వీధి మండలం సీలేరు మేజరు పంచాయతీలో అక్టోబర్‌ 2న నిర్వహించవలసిన గ్రామసభ వాయిదా వేయడం జరిగిందని స్థానిక సర్పంచ్‌ కె.పరదేశి వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో శనివారం మాట్లాడుతూ అక్టోబర్‌ 2న గాంధీ జయంతితో పాటు సీలేరులో ఆదివారం వారపు సంత కావడంతో గ్రామ సభకు వర్తకులు, ప్రజలు హాజరు కాలేరని పేర్కొన్నారు. దీంతో గ్రామసభ వాయిదా వేయడం జరిగిందని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని చెప్పారు.