Dec 31,2022 23:48

నూతన వేడుకల్లో పాల్గొన్న కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి- అనకాపల్లి
స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా స్పాట్‌ ఈవెంట్స్‌, ఫ్లాష్‌ మోబ్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ కేక్‌ కట్‌ చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో సరైన నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెల్లా నరసింహం, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైకుంఠరావు, డీన్‌ అడ్మిన్‌ డాక్టర్‌ కె ఎస్‌ ఈశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పారిశుధ్య సిబ్బందికి స్వీట్లు
జీవీఎంసీ 82వ వార్డు పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి, అధికారులకు వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యశాఖ అధికారి కె.రజిని, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.