Dec 24,2022 23:22

శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందిస్తున్న డైట్‌ ప్రిన్సిపల్‌ మాణిక్యంనాయుడు

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ (సిసిఆర్‌టి), డైట్‌ సంయుక్తంగా పలు అంశాలపై నిర్వహించిన వర్క్‌ షాప్‌ శనివారంతో ముగిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెలుగులోనికి రాని చారిత్రక అంశాలు, సంస్కృతి సంప్రదాయాలు, స్వాతంత్య్ర సమర యోధుల చరిత్రను డిజిటల్‌ రూపంలో రూపొందించేందుకు ఏర్పాటుచేసిన వర్క్‌ షాప్‌లో పాల్గొన్న ఔత్సాహికులకు ఆర్‌పిలు శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు పాల్గొన్న వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేశారు. డైట్‌ ప్రిన్సిపల్‌ యు.మాణిక్యంనాయుడు, సిసిఆర్‌టి కన్సల్టెంట్‌ వై.చంద్రశేఖర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ సౌందర్య కౌశిక్‌, సోమిశెట్టి సరళ, కెవిఎస్‌ఎస్‌ ప్రసాద్‌, రిసోర్స్‌ పర్సన్లుగానూ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌గా అధ్యాపకులు ఎస్‌కె అల్లాఉద్దీన్‌ వ్యవహరించారు. అధ్యాపకులు నాగేశ్వరరావు, మాధవి, త్రినాథరావు పాల్గొన్నారు.