Dec 26,2022 23:48

ర్యాంకింగ్‌ పత్రాన్ని చూపుతున్న డైట్‌ చైర్మన్‌ రత్నాకర్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి : స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు భారత సాంకేతిక విద్య కౌన్సిల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ స్కిల్‌ అవార్డు దక్కింది. డైట్‌ అధ్యాపకులు, విద్యార్థులు ఏఐసిటిఈ, ఎడ్యు స్కిల్‌ ఇంటర్‌ షిప్‌లో అత్యధిక శాతం ఉత్తీర్ణులైన నేపథ్యంలో అఖిల భారత స్థాయిలో 31వ ర్యాంకు సాధించినట్లు కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ తెలిపారు. నైపుణ్య కోర్సులను ప్రోత్సహించిన ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చల్లా నరసింహానికి ప్రిన్సిపల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2022 రావడంతో ఆయన్ను రత్నాకర్‌ అభినందించారు. దీనివల్ల విద్యార్థులకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మిన్‌ డాక్టర్‌ కెఎస్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.