
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెంలోని డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృత పరుస్తామని జోన్ చైర్ పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు తెలిపారు. క్లబ్ చైర్‌పర్సన్ కోనా హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో సోమవారం పేదలకు బియ్యం, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కోనా హనుమాన్‌కు సెక్రటరీ మద్దుకూరి మెహర్‌ప్రసాద్, క్లబ్ ప్రతినిధులు జొన్నల సతీష్‌కుమార్, పుత్తినీడి శివరామకృష్ణ, యడ్లపల్లి తిలక్, కె.సాయిరాజు, యెలిశెట్టి సత్యదేవ్, యర్రా ఆంజనేయస్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.