బి.కొత్తకోట : మండలంలోని నాయునిబావి పంచాయతీ గుట్టపాలెంకు చెందిన వెంకట రమణారెడ్డి కుమారుడు టి.మంజునాథ్‌రెడ్డి శనివారం చెట్టుకు ఉరివే సుకొని మతిచెందగా పోలీసులు అనుమానస్పద మతి కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. తల్లితండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు అనాధలుగా మిగిలారు మంజునాథరెడ్డికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషయం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలకు తెలియడంతో చలించిపోయారు. మంగళవారం ఎమ్మెల్యే వారిని కలిసి పరామ ర్శించి వారిని అక్కున చేర్చుకున్నారు. నలుగురు పిల్లల పూర్తి చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తానని, నలుగురు పిల్లల పేర్ల మీద ఒక్కోరికి రూ.2.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు పిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని హామీనిచ్చారు. పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా చదివిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, నాయకులు భీమిగాని ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ రామ్మోహన్ పాల్గొన్నారు.










