Jan 14,2023 23:33

రగ్గులు పంపిణీ చేస్తున్న దాతలు

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని లింగంపేట గ్రామంలో గ్రామ సంకీర్తన నిర్వహించారు. 10 మంది పేద వృదులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతకేడిపేట, కొంకసింగి, ఏఎల్‌పురం సత్య సాయి భక్తులు, గ్రామ మాజీ సర్పంచ్‌ అప్పలనాయుడు, త్రిమూర్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్‌:స్థానిక వ్యాపారవేత్త వెలగా నారాయణరావు దంపతులు పట్టణంలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా పేదలకు నారాయణరావు దంపతులు దుస్తులు పంపిణీ చేశారు.
నర్సీపట్నం రూరల్‌:నర్సీపట్నంలో తమ వ్యాపార సంస్థల వద్ద మహిళలకు చీరలు, దుప్పట్లను శ్రీరామ గ్రూప్స్‌ అధినేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మనాభుని కన్నయ్య శెట్టి, చిన్న బాబు విలేకరులతో మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు పద్మనాభుని శ్రీరామ మూర్తి, చెల్లయమ్మ పేరు మీదుగా ప్రతి సంవత్సరం పేద మహిళలకు చీరలు, దుప్పట్లు, శివరాత్రి రోజున స్టీలు సామాన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజల ఆశీర్వాదంతో వ్యాపారాల్లో అంచలంచెలుగా ఎదిగామని, ప్రతి సంవత్సరం తమకు తోచిన సహాయం పేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.