Oct 18,2023 20:28

ప్రజాశక్తి - కాళ్ల
సొంత ఊరిపై మమకారంతో కాళ్లకూరు గ్రామంలో దాట్ల వెంకటరామరాజు తన కుమార్తె పేరు మీద దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ట్రస్ట్‌ సభ్యులు పి.యోహాను అన్నారు. కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన గండికోట బుజ్జి కుటుంబానికి 26 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.