Oct 08,2023 21:38

ప్రజాశక్తి - కాళ్ల
             మండలంలోని కాళ్లకూరు గ్రామంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయం అందించడం అభినందనీయమని ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ బహుజన సంఘాల సమాఖ్య వ్యవస్థాపకులు సొడదాసి గంగయ్య అన్నారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకట రామరాజు మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన దండే రాజారావు అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న వెంకటరామరాజు మృతుని కుటుంబసభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5వేల ఆర్థిక సహాయం ఆదివారం అందించారు.