Jan 23,2023 23:46

ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆర్‌ఒ ప్లాంట్‌

ప్రజాశక్తి - రంపచోడవరం : రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హైదరాబాదుకు చెందిన పిజెఎస్‌ పాల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు స్టీఫెన్‌ పాల్‌, పైలా పాల్‌ దంపతులు ముందుకొచ్చారు. రూ.5 లక్షలతో రక్షిత మంచినీటి ఆర్‌ఒ ప్లాంట్‌, రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు కుర్చీలు, వీల్‌చైర్లు, స్ట్రైచర్‌ బల్లలు, మార్చురీగదికి చి నీటి సరఫరా సమకూర్చారు. ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మేరీ రోహిణి, ప్రవీణ్‌ దంపతులు చొరవతో ఈ సదుపాయాలు కల్పించేందుకు ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, డాక్టర్‌ సురేష్‌ సహకారంతో ఆసుపత్రిలో పనులు ముందుకు సాగుతున్నాయి.