అన్న క్యాంటీన్లో భోజనం వడ్డిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 177వ రోజుకు చేరింది. మంగళవారం బాపట్ల మండలం నందిరాజుతోటకు చెందిన తాతా జయప్రకాష్ నారాయణ, ధనలక్ష్మి సహకారంతో అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్న క్యాంటీన్ నిర్వహణకు సహకరిస్తున్న దాతలను నరేంద్రవర్మ అభినందించారు. కార్యక్రమంలో దాతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.










