అన్నదానం చేస్తున్న దాతలు
ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాపట్లలో తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆదివారం 273వ రోజుకు చేరింది. తాజాగా మహ్మద్ అజ్ మల్ షా తల్లిదండ్రులు మహ్మద్ ఆలమ్ షా - సుల్తానా సహకారంతో 250 మంది పేదలకు అన్నదానం చేశారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నరేంద్రవర్మ కృతజ్ఞతలు తెలిపారు.










