విద్యాసామగ్రిని అందజేస్తున్న ఎంఇఒలు
చింతకొమ్మదిన్నె దాత, నరేందర్ రెడ్డి సహకారం మరువలేనివని మండల విద్యాశాఖ అధికారులు వెంకట్రాంరెడ్డి, రమాదేవి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని స్థానిక సిఎంఆర్ పల్లె లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ అయిన నరేందర్ రెడ్డి విద్యార్థులకు పలకలు, నోట్ బుక్స్, పెన్సిళ్లు, కాపీ రైటింగ్ బుక్, టేబుల్ బుక్స్‌ను మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ఎనిమిది సంవత్సరాలుగా మండలంలోని పలు పాఠశాలల్లోని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఇలాగే దాతలు ముందుకు వచ్చి పిల్లలకు సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలిరెడ్డి, చండీప్రియ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










