ప్రజాశక్తి - ముసునూరు
తమ పాఠశాలలో ఉ పాధ్యాయునిగా ప ని చేస్తున్న దాసరి సుధ సాయి త్రిభాయి పూలే ఎ క్స్‌లెన్స్ అవార్డుకు ఎం పికైనట్లు ప్ర ధానోపా ధ్యా యులు ఎం. శ్రీనివాస్ తెలి పారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముసునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దాసరి సుధ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈ ఒక్క ఉపాధ్యాయురాలికి మాత్రమే అవకాశం దక్కిందన్నారు. ఈ నెల మూడో తేదీన తిరుపతిలోని ఆఫీసర్స్, కల్చరల్ అండ్ సోషల్ క్లబ్‌లో తెలంగాణా గవర్నర్ తమిళిసాయి చేతుల మీదగా అవార్డు ఆందుకోనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దాసరి సుధను ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు అభినందించారు.










