ప్రజాశక్తి- తిరువూరు
జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా జీవు ల ఆవిర్భావానికి సంబంధించి ప్రాచు ర్యంలో ఉన్న విశ్వాసాలను పటాపం చలు చేసిన ఘనత ఛార్లెస్ డార్విన్ కు దక్కుతుందని జనవిజ్ఞానవేదిక(జెవివ ప్రధాన కార్యదర్శి ఎల్.గంగాధర్ అన్నా రు. ఆదివారం తిరువూరులోని సిద్దార్ధ ఉన్నత పాఠశాలలో జెవివి ఆధ్వర్యం లో డార్విన్ జయంతిని నిర్వహించి ఆ యన చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసంద ర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో డార్విన్ జీవిత విశే షాలను విద్యార్థులు తెలుసుకోవాల న్నారు. ఈకార్యక్రమంలో జెవివి మండ ల ప్రధాన కార్యదర్శి డి.సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఎం.రాంప్రదీప్, పాఠశాల ప్రిన్సిపాల్ ఉప్పలపాటి చక్రపాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










