ప్రజాశక్తి - యాదమరి
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ మాస్టర్ కె.దామోదరాచారి చిత్రించిన చిత్రాలకు అంతర్జాతీయ, జాతీయ చిత్ర కళా పోటీలలో అవార్డుల పంట పండింది. ఆజాదికా అమత్ మహౌత్సవ్ భాగంగా కళా రత్నం ఆర్ట్ ఫౌండేషన్, బరేలీ (ఉత్తప్రదేశ్) వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంటెస్ట్‌లో 'ఫ్యామిలీ'అనే ఆధునిక శైలిలో అక్రీలిక్ రంగులతో వేసిన చిత్రానికి ' కళారత్నం' అవార్డు లభించినది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సి. ఏ.సి అకాడమీ కోయంబత్తూర్ తమిళనాడు వారు నిర్వహించిన నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంటెస్ట్ లో 'జాతికి అంకితం' అనే తైలవర్ణ చిత్రం 3వ ర్యాంకును గెలుచుకుంది. సజాత్మకత, దేశభక్తి, సామాజిక స్పహతో చిత్రాలు రూపొందిస్తున్నట్లు కె. దామోదరాచారి తెలిపారు. ఎంఇఒ, ప్రధానోపాధ్యాయులు దామోదరాచారిని అభినందించారు.










