Jun 22,2023 00:52

వినుకొండ: పట్టణంలోని మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జి వద్ద నూతనంగా వేసిన వెంచర్‌ భూములపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వినుకొండ తహశీల్దార్‌ కిరణ్‌ కుమార్‌ బుధవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ప్రభుత్వ చుక్కల భూములు, లోకాయుక్తలో కేసు విచారణ అం శాలపై మీడియాలో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్‌ స్పం దిస్తూ విచారణకు ఆదేశించగా అయా భూముల్లో ఉన్న వ్యక్తుల వద్ద డాక్యుమెంట్లతో 21వ తేదీ హాజరుకావాలని తాసిల్దార్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం వినుకొండ తాసిల్దార్‌ కార్యాలయానికి పత్రాలతో హాజరయ్యారు. తిమ్మాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 717/5, 720/4-1, 720/4-2, 720/4-4, 721, 722/1 ,739/1, 741/13 మొదలగు సర్వే నెంబర్ల డిస్తీర్ణంపై విచారణ చెప్పడం జరి గిందని తహశీల్దార్‌ తెలిపారు. 23 మం దికి నోటీసులు జారీ చేయగా 17 మంది హాజరైనట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న హక్కు పత్రములు పరిశీలించి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవి న్యూ అధికారులు స్టేట్‌ మెంట్లు రికార్డు చేసినట్లు చెప్పారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వివరించారు.