పాదయాత్రలో సిపిఎం నేతలు
ప్రజాశక్తి -ములగాడ : డాక్‌యార్డు బ్రిడ్జిపై 15నెలల పాటు రాకపోకలను నిషేధించాలన్న నేవల్ అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపి, రాకపోకలు యథావిధిగా సాగేలా చర్యలు చేపట్టాలని సిపిఎం నేతలు కోరారు. జివిఎంసి 58వ వార్డు ఉప్పరకాలనీ, అంజతాకాలనీ కోడిపందెల దిబ్బ, గుల్లలపాలెం, 61వ వార్డు మల్కాపురం, వెంకన్నపాలెం, రామకృష్ణాపురం ప్రాంతాల్లో సిపిఎం బృందం పాదయాత్రలు నిర్వహించారు. సిపియం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు ,కె.పెంటారావు మాట్లాడుతూ, డాక్‌యార్డు వంతెన సమస్యలపై నగర మేయర్, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలగజేసుకోవాలని కోరారు. పాదయాత్రలో ఎస్.సూరిబాబు, గంగులు, ఆదినాయణ తిరుపతిరావు, సుభానీ, వెంకటేష్, సురేష్, రాజేశ్వరి, ఈశ్వరమ్మ 61వవార్డు ఉమా, విజయ, విమల, కల్యాణి, జయలక్ష్మి, వరలక్ష్మి, బంగారరాజు, వాసు, ఏసుబాబు పాల్గొన్నారు.










