
ప్రజాశక్తి - కాళ్ల
డాక్టరేట్ పట్టా రావడంతో మరింత బాధ్యత పెరిగిందని సంఘ సేవకులు, అవార్డు గ్రహీత డి.నిరీక్షణరాజు అన్నారు. మండలంలోని కాళ్ల గ్రామంలో డాక్టరేట్ అవార్డు గ్రహీత డి.నిరీక్షణరాజుకు బుధవారం ఘనంగా సత్కార సభ నిర్వహించారు. ఆక్వా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కరోనా సమయంలో మొదటి, రెండు దశల్లో వందలాది మంది కార్మికులకు రూ.లక్షల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించిన ఘనత నిరీక్షణరాజుదేనన్నారు. ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. నిరీక్షణరాజు చేస్తున్న సేవలను గుర్తించి రాజస్థాన్‌లోని సన్‌రైజ్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు అందించిందన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత నిరీక్షణరాజు మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతిఒక్కరూ సామాజిక సేవలో పాలొ నాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టా కృపావరం, తాళ్లూరి రాజ్‌కుమార్, సిరింగి బాల, గండి శ్రీని వాస్, గునుపూడి ప్రసన్నకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.