
ప్రజాశక్తి - కాళ్ల
కోపల్లె గ్రామానికి చెందిన నీరిక్షణరాజుకు సమాజ సేవ చేసినందుకు డాక్టరేట్ రావడం అభినందనీయమని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, బహుజనసమాఖ్య సంఘ వ్యవస్థాపకులు సోడదాసి గంగయ్య అన్నారు. నిరీక్షణరాజును కోపల్లెలోని ఆయన నివాసంలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టి, బహుజన సమాఖ్య సభ్యులు, పలువురు నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరీక్షణరాజు తన సంపాదనలో కొంత సొమ్మును సామాజిక, ఆధ్యాత్మిక సేవలకు తన వంతు సాయం చేస్తున్నారన్నారు. ఆక్వా రంగంలో లేబర్ కాంట్రాక్టర్‌గా స్థిరపడి 15 ఏళ్లుగా కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందిస్తున్నారన్నారు. కోపల్లె గ్రామంలో అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి, వర్థంతి వేడుకలు నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆక్వా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కరోనా మొదటి, రెండు దశల్లో వందలాది మంది కార్మికులకు రూ.లక్ష ల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకు లు అందించారు. నిరీక్షణరాజు చేస్తున్న సేవల ను గుర్తించి రాజస్థాన్‌లోని సన్ రైజ్ యూని వర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, బహుజన సమాఖ్య సంఘ వ్యవస్థాప కులు సోడదాసి గంగయ్య, మైప ఎంపిటిసి సభ్యు లు ఆనందరాజు, ఉండి మండల అధ్యక్షులు కొండా రాజేష్‌కుమార్, దానియేలు, షాలేమ్‌రాజు పాల్గొన్నారు.