
ప్రజాశక్తి - ఆచంట
ఆచంట గ్రామానికి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్, స్మేక్ వ్యవస్థాపకులు, కోపరేటివ్ సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిలుకూరి సుబ్బారావు భార్య సత్యవతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. డాక్టర్ సుబ్బారావును సిపిఎం మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్, సిపిఎం మండల కమిటీ సభ్యులు, వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్.శర్మ, పి.మోహన్‌రావు, జ్యోతి గ్యాస్ యాజమాన్యం, నెక్కంటి వేణుగోపాలకృష్ణ బుధవారం పరామర్శించారు.
నేడు సత్యవతి సంతాప సభ
ఈ నెల ఏడో తేదీ స్థానిక మృత్యుంజయ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం పది గంటలకు సంతాప సభ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.