May 15,2023 01:54
ఇండియన్‌ ప్రైడ్‌ సెలబ్రిటీ అవార్డును అందుకుంటున్న డాక్టర్‌ రాధాకృష్ణ

ప్రజాశక్తి-చీరాల: సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఫోరం, ప్రైడ్‌ ఇండియా కల్చరల్స్‌ వారి ఆధ్వర్యంలో చీరాలకు చెందిన డాక్టర్‌ సురసుర రాధాకృష్ణ ఇండియన్‌ ప్రైడ్‌ సెలబ్రిటీ అవార్డును అందుకున్నారు. శనివారం రాత్రి శ్రీకాళహస్తిలోని త్రినేత్ర నృత్య నీరాజనం వేదికపై మాజీ ఎమ్మెల్యే ఎస్‌ సీవీ నాయుడు, శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్‌ అంజురు తారక శ్రీనివాసులు, ఆర్డీవో రామారావు, డీఎస్పీ డి విశ్వనాథ్‌ తదితర ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును వారి చేతుల మీదుగా అందుకున్నారు. చీరాల మండలం ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామాల్లో వైద్యసేవలను అందించినందుకు, పేద ప్రజల ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధకు ఈ అవార్డు వచ్చినట్లు అవార్డు గ్రహీత రాధాకృష్ణ తెలిపారు.