ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలించాలని కోరుతూ శనివారం ఉదయం ఎయు ఇంజినీరింగ్ కాలేజ్, మద్దిలపాలెం ఆర్‌టిసి బస్‌స్టాండ్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ మాట్లాడుతూ, పిడిఎఫ్ విలువలకు, నీతి, నిజాయతీకి కట్టుబడి ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో పోరాడుతోందన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం బంజార హిల్స్‌లో ఇచ్చిన ఇచ్చిన 500 గజాల ఇళ్ల స్థలాలను తిరస్కరించారని తెలిపారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు వస్తున్న వేతనాలను కూడ ప్రజా సంఘాల ఉద్యమాలకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీలలో 58కిగానూ 48 రాజకీయ పార్టీల ప్రతినిధులే ఉంటారని, కేవలం 10 సీట్లు మాత్రమే పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కేటాయించారని తెలిపారు. ఆ స్థానాల్లో కూడా రాజకీయ పార్టీలు పోటీ చేస్తే పట్టభద్రుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఎవరు ప్రశ్నిస్తారన్నారు. ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయు మాజీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కెఎస్.కోటేశ్వరరావు, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, బి.జగన్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ, వామన మూర్తి, గోవింద్, మోటార్ ట్రాన్స్‌పోర్టు యూనియన్ నాయకులు శ్రీరాములు, వివిధ ప్రజా సంఘాల నాయకులు జిఎస్.రాజేశ్వరరావు, చలపతి, పి.అప్పారావు, కుమారి, ఎల్‌జె.నాయుడు, తులసి, వెంకటరావు, బొడ్డు దేముడు తదితరులు పాల్గొన్నారు.