Aug 19,2023 17:39

ప్రజాశక్తి - భీమడోలు
    ఫోటోగ్రఫీ సృష్టికర్త డాగ్యురే సేవలను ఫోటోగ్రాఫర్లు నిత్యం స్మరించుకోవాలని భీమడోలు సర్కిల్‌ ఏరియా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు పిల్లి బ్రహ్మరావు, ఎ.రంగారావు కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సంఘం ఆధ్వర్యంలో శనివారం సంతపేట ఏరియాలోని డాగ్యురే, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వేదిక వద్ద సంఘ అధ్యక్షులు డి.శ్రీరామ్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఐక్యతగా మెలిగి సంఘ అభివృద్ధికి, ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. అనంతరం సంఘ సభ్యులు కెమెరా సృష్టికర్త డాగ్యురేతో పాటు మిస్సైల్‌ మాన్‌గా గుర్తింపు పొందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కోశాధికారి పి.రామ్మూర్తి, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.