ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్)
పూజ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, డాడీ హోమ్ అనాధ శరణాలయం వ్యవస్థాపకుడు రాజారెడ్డి మతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న రాత్రి పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో రాజారెడ్డి అనుమా నాస్పదంగా పడి ఉండటానికి గమనించి రాజారెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి, భార్య ప్రసన్న, స్కూలు సిబ్బంది కొంతమంది కలిసి రాజారెడ్డిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజారెడ్డిని పరీక్షించిన ప్రభుత్వ డాక్టర్ వీరనాద్ రెడ్డి రాజారెడ్డి గుండెపోటుతో మతి చెందాడని చెప్పారు. మరుసటి రోజు ఉదయం రాజారెడ్డి, మతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాడీని బంధువులకు అప్పచెప్పారు. అయితే రాజారెడ్డి శరీరంపై రక్తపు గాయాలు ఉండటంతో రాజారెడ్డి సన్నిహితులు కొందరు కలెక్టర్ జిల్లా, ఎస్‌పి దష్టికి తీసుకు వెళ్లడంతో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రాజారెడ్డి మతదేహానికి రిపోస్టు మార్టం చేయాలని ఆదేశించారు. దీంతో రాజారెడ్డి మతదేహానికి అదే రోజు మరొకసారి ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణకుమార్, జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు ఆధ్వర్యంలో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు రాజారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆయన తమ్ముడు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పోలీసులకు విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఎఎస్‌పి ప్రేరణ కుమార్ వెల్లడించారు. రాజారెడ్డి ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తుల విషయమై కొద్ది రోజులుగా రాజారెడ్డికి, అతను తమ్ముడికి గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. రాజారెడ్డికి వివాహం కాకపోవడంతో ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవ హారాలు, ఆస్తులు తమకు బదలాయించాలని తమ్ముడు కోరగా అందుకు ఆయన నిరాకరించారని పైగా పూజ ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న తన మరదలు ప్రసన్నను నెలరోజుల కిందట రాజారెడ్డి తొలగించారని పేర్కొన్నారు. దీంతో రాజారెడ్డిపై కోపం పెంచుకున్న శ్రీధర్ రెడ్డి, అతని భార్య ప్రసన్న కలిసి గత కొద్ది రోజులుగా రాజారెడ్డిని హత్య చేయడానికి పథకం వేసినట్లు తెలిపారు. ఈనెల 11న రాత్రి పూజా టెక్నో స్కూల్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో అప్పటికే ముందస్తుగా అనుకున్న ప్రకారం శ్రీధర్ రెడ్డి, మరో ఇద్దరు యువకులు సుభాన్, శివ కలిసి ఒకసారిగా రాజారెడ్డిపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశారన్నారు. రాజారెడ్డి హత్య కేసులో ఐదుగురిపై హత్య కేసు నమోదు చేశామని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు, టూటౌన్ సిఐ ఇబ్రహీం, రూరల్ ఎస్‌ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










