Feb 06,2023 00:09

మాట్లాడుతున్న ప్రజా సంఘాల నేతలు

ప్రజాశక్తి-మాకవరపాలెం:మండలంలోని జి వెంకటాపురం శివారు నగరం గ్రామంలో దళితలపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం గ్రామంలో ప్రజా సంఘాల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళితులపై దాడి చేసిన ఇద్దరిని మాత్రమే అరెస్ట్‌ చేశారని, మిగిలిన ఎనిమది మందిని కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు అన్ని విధాలుగా రక్షణ కన్పించాలని కోరారు. లేనిపక్షంలో దళిత ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు చలపతి, చిరంజీవి, మల్లేష్‌ పాల్గొన్నారు.