Oct 23,2022 23:30

నినాదాలు చేస్తున్న నాయకులు, గిరిజనులు,

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:అరకులోయ మండలం మాదల పంచాయతీ దాబుగుడ క్వార్డ్జ్‌ కొండపై అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు దొంగ సర్వేలు ఆపకుంటే సహించేది లేదని సీపీఎం మండల కార్యదర్శి కె.రామారావు తెలిపారు. ఆదివారం గిరిజన సంఘం ఆధ్వర్యాన దాబుగుడ కొండ పైన ఈ ప్రాంత గిరిజనులు నిరసన చేపట్టారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు మాట్లాడుతూ, ఈ కొండ చుట్టూ పక్కల 10 గ్రామాలకు ఊట గెడ్డలు, కాఫీ తోటలు, పంట పొలాలు, చింత చెట్లు ఉన్నాయని తెలిపారు. కొండలపై ఆధారపడి గిరిజనులు జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో ఉన్న తహసిల్డార్‌ తాత్కాలికంగా సర్వే నిలిపి వేశారని, మళ్లీ ఇప్పుడు వైసిపి నేత జగన్మోహన్‌ రెడ్డి అండ దండలతో దొంగ సర్వేలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బాక్సైట్‌ అనుమతులు రద్దు చేశామని, ఒకపక్క చెపుతూ మరో వైపు బాక్సైట్‌ కొండలకు అనుమతి ఇస్తూ గిరిజనులను మోసం చేస్తుందని దుయ్య బట్టారు. గిరిజన చట్టాలు, హక్కులకు భంగం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కార్యకర్తలను మభ్యపెట్టి రహస్యంగా సర్వేలు నిర్వహించి దొంగ సంతకాలతో మైనింగ్‌ కాంట్రాక్ట్‌లను బాక్సైట్‌ కొండ పరిధిలో గిరిజనులకు భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్‌ నాయకులు సీవేరి.దొన్ను దొర, పెదలబుడు పంచాయతీ సర్పచ్‌ దాసుబాబు, మాదల పంచాయతీ సర్పంచ్‌ శ్రీనివాసరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, మాదల పంచాయతీ గిరిజన సంఘం నాయకులు కే.రమేష్‌, కె.అప్పన్న, కె.ప్రసాద్‌, గోపాల్‌, గిరిజనులు జి.మధు, టి.అప్పారావు, డి రాజు, సన్యాసి, శిబో, కొమ్ములు, కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.