Jul 26,2023 21:08

3 గంటలు శ్రమించి కిందకు దించిన స్థానికులు
ప్రజాశక్తి - పాలకొల్లు
పట్టణంలో కోర్టు సమీపంలో బుధవారం భారీ వర్షానికి ఓ ఆవు కంప్యూటర్‌ బిల్డింగ్‌పైకి మెట్ల గుండా ఎక్కింది. అయితే తిరిగి రాలేకపోవడంతో స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు ఆవును కిందకు దింపడానికి తీవ్ర కృషి చేశారు. చివరకు ఏనిమల్‌ వారియర్‌ ముఖేష్‌ గౌడ్‌ సహాయంతో 3 గంటలు శ్రమించి ఆవును కిందకు దింపారు.