Apr 05,2023 16:12

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు నివాళ్లు అర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, చైర్ పర్సన్ తదితరులు

డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని కొనసాగిద్దాం...
డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళ్లు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ,
 ప్రజాశక్తి నంద్యాల కలెక్టరేట్

      బడుగు బలహీన వర్గాల కృషి చేసిన మహానీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు అన్నారు. డా.బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతిని  పురస్కరించుకుని బుధవారం నంద్యాల లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్  విగ్రహానికిఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, మున్సిపల్ కమీషనర్ సి. రవిచంద్రారెడ్డి, డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుల మతాల పేరుతో మనుషులు వేరు వేరుగా నా సమాజంలో ఉండకూడనే ఆకాంక్షతో పని చేశారన్నారు. వివక్ష చూపుతూ దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పని చేశారని డా.బాబు జగ్జీవన్ రామ్ సేవలను వారు కొనియాడారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి యని, దేశంలో ఆయన అనేక పదవులను చేపట్టాడని, తను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారన్నారు.మహనీయుల సేవలను మరువకూడదనే ఉద్దేశ్యం తో వారి సేవలను గుర్తించుకోవడానికి పట్టణంలోని వివిధ పార్కులకు వారి పేర్లు నామకరణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవి చంద్ర కిశోర్ రెడ్డి పేర్కొన్నారు.పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయాన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మనిటరింగ్ సభ్యులు చిటికెల సలోమి,వివిధ సంఘాల దళిత నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాస్, దండు వీరయ్య మాదిగ తదితరులు పాల్గొని ప్రసంగించారు.