ప్రజాశక్తి-పెదబయలు : శ్రీ శ్రీ మొదకొండమ్మ జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన స్థానిక ప్రజాప్రతిందులు మండల కేంద్రంలో ఈనెల 28, 29, 30న జరుగు ఉత్తరంద్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ జాతర నేపథ్యంలో ఆర్,జి,ఎస్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా స్థానిక సర్పంచీ పి మాధవ రావు ఎంపీటీసీ కె బొంజుబాబులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చట్టారు చదుతో పాటు క్రీడాలందు ముందుండి గ్రామానికి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ టోర్నమెంట్ 30 టీమ్ లు పాల్గొంటున్నాయని ప్రధమ విజేతలకు 30 వేలు ద్వితీయ విజేతలకు 15 వేల రూపాయలు బహుమతిగా అందించనున్నామని క్రీడాకారులు నియమానిబంధనలు పాటించాలని మేనేజ్ మెంట్ కు సహకరించలని ప్రతి క్రీడా కారుడు యూనిపారం దుస్తులు ధరించాలని కోరారు.










