Apr 30,2023 16:13

ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు : ప్రతి ఏటా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ఎమ్మెల్యే అద్యక్షతన ఆదివారం ఉదయం ఏపీఆర్వోలు, పీఆర్వోలు, ఏపీఆర్వోలతో ముక్కోటిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మహాపాదయాత్రలో వున్న చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నిర్వహించిన క్రికెట్ పై సమీక్ష సమావేశానికి మీలో చాలా మంది హాజరయ్యారు. ఎమ్మెల్యే చెప్పిన విషయాలు విన్నారు. క్రికెట్ అంటే మన యువతలో ఎనలేని ఆసక్తి ఉంది. అలాంవటి క్రీడాకారులందరితో చంద్రగిరి నియోజకవర్గం మొత్తం పండగలా పోటీలు నిర్వహించాలి. ఇదే సమాచారం గ్రామ స్థాయి వరకూ నాయకులకు, ప్రతి క్రీడాకారునికి వెంటనే చేరేలా చూద్దాం. ఎమ్మెల్యే అంచనాల మేరకు పోటీలకు చాలా ఎక్కువ జట్లు వచ్చేలా కృషి చేద్దాం. ప్రశాంతంగా ఈ పోటీలు విజయవంతంగా సాగేందుకు మనం అన్ని జాగ్రత్తలతో ముందుకెళ్దాం, క్రికెట్ పండగకు ఊరూ వాడా మనమంతా పెద్దలే అని అన్నారు. ప్రైజ్ మనీ భారీగా ఉన్న విషయం తెలపండి. విలువైన  ఙ్ఞాపికలు ఇస్తున్నాం. ప్రతి ఆటగాడికీ డ్రెస్, కిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని ఎమ్మెల్యే క్రీడా స్పూర్తి ని చాటిచెబుదామన్నారు.