ప్రజాశక్తి-విఅర్ పురం': జనవరి 28 మండలంలోని పెద్ద మట్టపల్లి రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీపీ కారం లక్ష్మి స్థానిక సర్పంచ్ వెట్టి లక్ష్మి సిపిఎం నాయకులు కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన మూడు కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాలకు సంబంధించి మండల కేంద్రం రేఖపల్లి కుందులూరు పెద్దమటపల్లి రైతు భరోసా కేంద్రాలలో పెద్ద మట్టపల్లి 700 మెట్రో టన్నులు రేకపల్లి 500 మెట్రో టన్నులు కుందులూరు 700 మెట్రో టన్నులు మొత్తం 18.76 మెట్రో టన్నులు కొనుగోలు చేసిందని ఇంకా 1000 మెట్రో టన్నులు మూడు కేంద్రాల్లో దాన్యం చేరింది అని వెంటనే వాటిని సివిల్ సప్లై అధికారులు కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులను కూడగట్టి ఎమ్మార్వో ఆఫీస్ ముందు సోమవారం నాడు ధర్నాకి దిగుతామని వెంటనే బాదిత రైతులకు న్యాయము చేయాలనీ సిపిఎం నాయకులు రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల ఏకం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, రైతు సంఘం నాయకులు కుంజ నాగిరెడ్డి. వడ్లాది రమేష్. ప్రజా ప్రతినిధులు స్థానిక ఎంపీటీసీ ప్రదీప్ కుమార్ సర్పంచ్ సంతోష్ కుమార్ సిపిఎం నాయకులు శ్రీరామ్ మూర్తి, కారం సుందరయ్య, గుండెపోడి లక్ష్మణ్ రావు, తుర్రం బాబురావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










